Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 30, 2013

2వ సమూయేలు 15

2Sa 15:1  ఇదియైన తరువాత అబ్షాలోము ఒక రథమును గుఱ్ఱ. .. ములను సిద్ధపరచి, తనయెదుట పరుగెత్తుటకై యేబదిమంది బంటులను ఏర్పరచుకొనెను. 
2Sa 15:2  ఉదయముననే లేచి బయలుదేరి పట్టణముయొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి, రాజుచేత తీర్పునొందుటకై వ్యాజ్యెమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచినీవు ఏ ఊరివాడవని యడుగుచుండెనునీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో ఫలానిదానికి చేరిన వాడనని వాడు చెప్పగా 
2Sa 15:3  అబ్షాలోమునీ వ్యాజ్యెము సరిగాను న్యాయముగాను ఉన్నదిగాని దానిని విచారించు టకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి 
2Sa 15:4  నేను ఈ దేశమునకు న్యాయాధిపతినైయుండుట యెంత మేలు; అప్పుడు వ్యాజ్యెమాడు వారు నాయొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు వచ్చెను. 
2Sa 15:5  మరియు తనకు నమస్కారము చేయుటకై యెవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దుపెట్టుకొనుచు వచ్చెను. 
2Sa 15:6  తీర్పునొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయుల కందరికి అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయుల నందరిని తనతట్టు త్రిప్పుకొనెను. 
2Sa 15:7  నాలుగు1 సంవత్సరములు జరిగినమీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చినీ దాసుడనైన నేను సిరియ దేశము నందలి గెషూరునందుండగాయెహోవా నన్ను యెరూష లేమునకు తిరిగి రప్పించినయెడల నేను ఆయనను సేవించె దనని మ్రొక్కు కొంటిని గనుక, 
2Sa 15:8  నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవిచేయగా 
2Sa 15:9  రాజుసుఖముగా పొమ్మని సెలవిచ్చెను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను. 
2Sa 15:10  అబ్షాలోముమీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీ యుల గోత్రములన్నిటియొద్దకు వేగుల వారిని పంపెను. 
2Sa 15:11  విందునకు పిలువబడియుండి రెండువందల మంది యెరూషలేములోనుండి అబ్షాలోముతో కూడ బయలుదేరి యుండిరి, వీరు ఏమియు తెలియక యథార్థమైన మనస్సుతో వెళ్లియుండిరి. 
2Sa 15:12  మరియు బలి అర్పింపవలెనని యుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతో పెలు అను దావీదుయొక్క మంత్రిని గీలో అను అతని ఊరినుండి పిలిపించి యుండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి మరి యెక్కువగుటచేత కుట్ర బహు బల మాయెను. 
2Sa 15:13  ఇశ్రాయేలీయులు అబ్షాలోముపక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా 
2Sa 15:14  దావీదు యెరూషలేము నందున్న తన సేవకులకందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను అబ్షాలోము చేతిలోనుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము; మనము పారిపోదము రండి, అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడుచేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్లిపోదము రండి. 
2Sa 15:15  అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరిచిత్తగించుము; నీ దాసుల మైన మేము మా యేలినవాడవును రాజవునగు నీవు సెల విచ్చినట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము. 
2Sa 15:16  అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులగు పదిమందిని ఉంచిన మీదట తన యింటివారినందరిని వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను. 
2Sa 15:17  రాజును అతని యింటి వారును బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బసచేసిరి. 
2Sa 15:18  అతని సేవకులందరును అతని యిరుపార్శ్వముల నడిచిరి; కెరే తీయులందరును పెలేతీయులందరును గాతునుండి వచ్చిన ఆరువందల మంది గిత్తీయులును రాజునకు ముందుగానడచుచుండిరి. 
2Sa 15:19  రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొనినీవు నివాసస్థలము కోరు పరదేశివై యున్నావు; నీవెందుకు మాతో కూడ వచ్చుచున్నావు? నీవు తిరిగి పోయి రాజున్న స్థలమున ఉండుము. 
2Sa 15:20  నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతోకూడ ఈ తిరుగులాట యెందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము; కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక యని చెప్పగా 
2Sa 15:21  ఇత్తయినేను చచ్చినను బ్రదికినను, యెహోవా జీవముతోడు నా యేలిన వాడవును రాజవునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా యేలినవాడవును రాజవునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవిచేసెను. 
2Sa 15:22  అందుకు దావీదుఆలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరును అతని కుటుంబికులందరును సాగిపోయిరి. 
2Sa 15:23  వారు సాగిపోవు చుండగా జనులందరు బహుగా ఏడ్చుచుండిరి, ఈ ప్రకారము వారందరు రాజుతోకూడ కిద్రోనువాగు దాటి అరణ్యమార్గమున ప్రయాణమై పోయిరి. 
2Sa 15:24  సాదోకును లేవీయులందరును దేవుని నిబంధన మందసమును మోయుచు అతనియొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములోనుండి జనులందరును దాటిపోవు వరకు నిలిచెను. 
2Sa 15:25  అప్పుడు రాజు సాదోకును పిలిచిదేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసికొనిపొమ్ము; యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినయెడల ఆయన నన్ను తిరిగి రప్పించి 
2Sa 15:26  దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి 
2Sa 15:27  యాజకుడైన సాదోకుతో ఇట్లనెనుసాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను. 
2Sa 15:28  ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్య మందలి రేవులదగ్గర నిలిచి యుందును. 
2Sa 15:29  కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసికొనిపోయి అక్కడ నిలిచిరి. 
2Sa 15:30  అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలులేకుండ కాలినడకను వెళ్ళెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి. 
2Sa 15:31  అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదుయెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడ గొట్టుమని ప్రార్థన చేసెను. 
2Sa 15:32  దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొనివచ్చి రాజును దర్శనము చేసెను. 
2Sa 15:33  రాజునీవు నాతో కూడ వచ్చినయెడల నాకు భారముగా ఉందువు; 
2Sa 15:34  నీవు పట్టణమునకు తిరిగి పోయిరాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్ట గలవు. 
2Sa 15:35  అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు; కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడినయెడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాని చెప్పవలెను. 
2Sa 15:36  సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారు డైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చట నున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను. 
2Sa 15:37  దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చు చుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను. 

No comments:

Post a Comment